Tuesday, July 31, 2012

నడిరేయి యే ఝాములో


నడిరేయి యే ఝాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో
మముకన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు వొడిలోన మురిసేటివేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళ
విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాలు నే నడువలేను యేపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా.. మము కన్న మాయమ్మ అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

కలవారినే గాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు స్వామి కౠణామయుందన్న బిరుదేలనమ్మా
అడగవె మాతల్లి అనురాగవల్లి అడగవె మాయమ్మ అలివేలుమంగ

నడిరేయి యే ఝాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో

http://soundclick.com/share.cfm?id=11800822

ఏమని పాడెదనో ఈవేళా


ఏమని పాడెదనో ఈవేళా
మానసవీణా మౌనముగా నిదురించినవేళా
ఏమని పాడెదనో

జగమే మరచి హృదయవిపంచి గారడిగా వినువీధి చరించి
కలతనిదురలో కాంచిన కలలే గాలిమేడలై కూలినవేళ
ఏమని పాడెదనో

వనసీమలలో హాయిగ ఆడే రాచిలుకా నిను రాణిని చేసి
పసిడితీగెల పంజరమిదిగో పలుకవేమని పిలిచేవేళ

ఏమని పాడెదనో ఈవేళా
మానసవీణా మౌనముగా నిదురించినవేళా
ఏమని పాడెదనో

http://soundclick.com/share.cfm?id=11800821

Friday, November 30, 2007

పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా కృష్ణా పదుగురెదుటా పాడనా
పొదల మాటున పొంచి పొంచి యెదను దోచిన వేణుగానము
వొలకపోసిన రాగసుధకు మొలకలెత్తిన లలిత గీతి

పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా

చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు
మెచ్చలేరీ వెచ్చని హృదయాల పొంగిన మధుర గీతి
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా

యెవరూ లేని యమునా తటినీ ఎక్కడో ఏకాంతమందున
నేను నీవై నీవు నేనై పరవశించే ప్రణయ గీతి
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా
నిదురించే తోట లోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా నిలిచింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది

విఫలమైన నాకోర్కెలు వెలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది తోసుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
భావయామి గోపాల బాలం మనస్సేవితం తత్పదం చింతయేహం సదా
కటిఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా
పటల నినదేన విభ్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల శింజితే నతం
చటుల నటనా సముజ్జ్వల విరాజం

నిరత కర కలిత నవనీతం
బ్రహ్మాది సుర నికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
పరమ పురుషం గోపాల బాలం

http://soundclick.com/share.cfm?id=6027394

Monday, October 30, 2006

కనరాని దేవుడే కనిపించినాడే
కనిపించి అంతలో కన్ను మరుగాయే

అల నీలి గగనాల వెలిగె నీ రూపు
ఆనంద బాష్పాల మునిగె నా చూపు
కనులార నిను చూడలేనైతి స్వామి
కరుణించి ఒకసారి కనిపించవేమి

అందాల కన్నయ్య కనిపించగానే
బృందావనమ్మెల్ల పులకించిపోయే
యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే
నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే

వలపుతో పెనవేయు పారిజాతమునై
ఎద మీద నిదురించు అడియాస లేదు
గడ్డిలో విరబూయు కన్నె కుసుమమునై
నీ చరణ కమలాల నలిగిపోనీవా

http://soundclick.com/share.cfm?id=6027739

Monday, September 25, 2006

జై జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ

శీతశైల మణి శృంగ కిరీటా సింహళ జాంబూ నగ పీఠా
వింధ్య మహీధర మహా మేఖలా విమల కాశ్మీర కస్తూరి రేఖా
జై జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ

గంగా సింధూ మహానదీ గౌతమీ కృష్ణా కావేరీ
క్షీర సార పరిపోషిత కోమల సస్య విశాలా శ్యామలా
జై జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ



http://soundclick.com/share.cfm?id=6027731