Friday, November 30, 2007

పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా కృష్ణా పదుగురెదుటా పాడనా
పొదల మాటున పొంచి పొంచి యెదను దోచిన వేణుగానము
వొలకపోసిన రాగసుధకు మొలకలెత్తిన లలిత గీతి

పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా

చిలిపి అల్లరి తెలిసినంతగ వలపు తెలియని గోపకాంతలు
మెచ్చలేరీ వెచ్చని హృదయాల పొంగిన మధుర గీతి
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా

యెవరూ లేని యమునా తటినీ ఎక్కడో ఏకాంతమందున
నేను నీవై నీవు నేనై పరవశించే ప్రణయ గీతి
పాడమని నన్నడగ తగునా పదుగురెదుటా పాడనా