Tuesday, July 31, 2012

నడిరేయి యే ఝాములో


నడిరేయి యే ఝాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో
మముకన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు వొడిలోన మురిసేటివేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళ
విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాలు నే నడువలేను యేపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా.. మము కన్న మాయమ్మ అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

కలవారినే గాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు స్వామి కౠణామయుందన్న బిరుదేలనమ్మా
అడగవె మాతల్లి అనురాగవల్లి అడగవె మాయమ్మ అలివేలుమంగ

నడిరేయి యే ఝాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో

http://soundclick.com/share.cfm?id=11800822

ఏమని పాడెదనో ఈవేళా


ఏమని పాడెదనో ఈవేళా
మానసవీణా మౌనముగా నిదురించినవేళా
ఏమని పాడెదనో

జగమే మరచి హృదయవిపంచి గారడిగా వినువీధి చరించి
కలతనిదురలో కాంచిన కలలే గాలిమేడలై కూలినవేళ
ఏమని పాడెదనో

వనసీమలలో హాయిగ ఆడే రాచిలుకా నిను రాణిని చేసి
పసిడితీగెల పంజరమిదిగో పలుకవేమని పిలిచేవేళ

ఏమని పాడెదనో ఈవేళా
మానసవీణా మౌనముగా నిదురించినవేళా
ఏమని పాడెదనో

http://soundclick.com/share.cfm?id=11800821