నడిరేయి యే ఝాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో
మముకన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతిదేవు వొడిలోన మురిసేటివేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళ
విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా
ఏడేడు శిఖరాలు నే నడువలేను యేపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా.. మము కన్న మాయమ్మ అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా
కలవారినే గాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు స్వామి కౠణామయుందన్న బిరుదేలనమ్మా
అడగవె మాతల్లి అనురాగవల్లి అడగవె మాయమ్మ అలివేలుమంగ
నడిరేయి యే ఝాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో
http://soundclick.com/share.cfm?id=11800822